మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 28: గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవడం అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రశంసించారు. మండలంలోని రామలచ్చక్కపేటలో గ్రామస్తులు నూతనంగా నిర్మించుకున్న ఫంక్షన్‌హాల్‌ను మంగళవారం జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు సమష్టిగా ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అంతకు ముందు గ్రామస్తులు గజమాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కల్వకుంట్ల సంజయ్, సర్పంచ్ గజ్జెల నరేశ్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఉపసర్పంచ్ పాలెపు రాజ గంగారాం, పీఏసీఎస్ అధ్యక్షుడు కేసిరెడ్డి నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోపిడి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.