కేసీఆర్ పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం.. దీక్షా దివస్ చరిత్రలో నిలిచిపోతుంది
‘యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అని ప్రాణాలకు తెగించి నిలబడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఆయన ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది.. అమరవీరుల త్యాగం, కేసీఆర్ పోరాటం, రేవంత్‌రెడ్డి ద్రోహాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ మర్చిపోరు’అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
- కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అంటేనే తెలంగాణ వచ్చింది
- ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది
- రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : ‘యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అని ప్రాణాలకు తెగించి నిలబడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఆయన ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది.. అమరవీరుల త్యాగం, కేసీఆర్ పోరాటం, రేవంత్‌రెడ్డి ద్రోహాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ మర్చిపోరు’అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన నిర్వహించిన ‘దీక్షా దివస్’కు పెద్దపల్లి, మంథని మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన చరిత్రలో కేసీఆర్ ఒక హీరో అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆనాడు జీరో అని, ఆంధ్రా పాలకుల అడుగులకు మడుగులొత్తి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేశారని గుర్తు చేశారు.
కేసీఆర్ పుణ్యమాని ఆయన సాధించిన రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన సంగతిని రేవంత్‌రెడ్డి మర్చిపోవద్దని హితవు పలికారు. 2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా.. టీఎస్‌ను టీజీ చేసినా తెలంగాణ చరిత్రను ఎవరూ చెరిపేయలేరన్నారు. కేసీఆర్ దీక్ష అబద్ధపు దీక్ష అన్న పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు సిగ్గుండాలన్నారు. అసలు ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఏ మూలన దాక్కున్నాడని ప్రశ్నించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను అధిక సంఖ్యలో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, నాయకులు మూల విజయారెడ్డి, కౌశికహరి, గంట రాములు, దాసరి ఉష, ముత్యాల బలరాంరెడ్డి, మోహన్ రావు, ఆముల నారాయణ, నూనేటి సంపత్, వంగల తిరుపతిరెడ్డి, ఉప్పు రాజ్‌కుమార్, ఏగోళపు శంకర్ గౌడ్, ఆరెపల్లి కుమార్, తగరం శంకర్‌లాల్, నారాయణదాస్ మారుతి పాల్గొన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలాగైతే ఉద్యమం చేశామో అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు పని చేయాలి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ, 22 నెలలైనా ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఆ పార్టీపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దానిని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తపై ఉంది. బీఆర్ఎస్ బలోపేతానికి పని చేసిన ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది. అందుకు ఉదాహరణ నేనే. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యేను చేసింది. జిల్లా అధ్యక్షుడిని చేసింది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి.
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
అధికారమే పరమావధిగా.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలి. ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటాలి. తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ గడ్డమీద పుట్టి ప్రతి ఒక్కరూ బాగుపడాలనే లక్ష్యంతో పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. బంగారు తెలంగాణ కోసం అడుగులు పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలి. దీక్షా దివస్ చరిత్రలో మరచిపోలేని రోజు. ప్రతి తెలంగాణ బిడ్డ గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఉద్యమంలో నుంచి కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని వేరు చేయలేరు.
-పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి.
నమ్మించి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం
ప్రజలను నమ్మించి మోసం చేయడమే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ నైజంగా ఉంది. అదే రీతిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిపించాలని చూస్తున్నది. నిజంగా దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ప్రజలు చరమగీతం పాడాలి. ఆ పార్టీ లేకుంటేనే దేశం బాగు పడుతుంది. ఉద్యమంలో అనేక రాస్తారోకోలు, ధర్నాలు, పోరాటాలు చేసి రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ పాలనే గొప్పదని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తామని చెప్పిన శ్రీధర్‌బాబు ఇంకా ఎందుకు చేయలేదు. నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను నిలదీసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారు.
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

