Konda Laxman Bapuji | కోల్ సిటీ, సెప్టెంబర్ 21: తెలంగాణ కోసం తన యావదాస్తిని దారాదత్తం చేసిన నికార్సైన ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ అన్నారు. ఈ మేరకు బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని మార్కండేయ కాలనీ జంక్షన్ వద్ద గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆడేపు శంకర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం 1969లో తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్న నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని పేర్కొన్నారు.
అప్పటి నుంచి 2012 వరకు తెలంగాణ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తూనే రాష్ట్ర చేనేత సహకార రంగానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్న సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారని గుర్తు చేశారు. ఆయన జీవితం, రాజకీయ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
బాపూజీ అడుగుజాడల్లో పద్మశాలీలు ఐక్యతతోముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో 42 వ డివిజన్ మాజీ కార్ఫోరేటర్ బాల రాజ్ కుమార్ , మోర శ్రీనివాస్, అడిచర్ల నంబయ్య, నూతి తిరుపతి, పిట్ట లక్ష్మీ నరసయ్య, గజ్జెల్లి వెంకటేశం, ఆడేపు చంద్రయ్య, వొడ్నాల రాజన్న , బూర్ల శ్రీనివాస్,మానాల ప్రభాకర్ , గుండేటి ప్రభాకర్, ఆడెపు రవి, వొడ్నాల రాజయ్య, తాడికొండ రవీందర్, మంతెన శ్రీనివాస్, చీరాల సత్యనారాయణ, శ్రీనివాస్,రాజేశం అధిక సంఖ్యలో కులబాంధవులు పాల్గోన్నారు.