సంతోషాలు నింపాలి
స్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు.
- అందరూ కలిసి జరుపుకోవాలి
- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 25 : క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు. సోమవారం ఆయన కరీంనగర్‌తోపాటు నియోజకవర్గంలోని పలు చర్చిలను సందర్శించి, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ శాంతిని కోరుకున్న వ్యక్తి ఏసు ప్రభువును అని గుర్తు చేశారు.
ఏసు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఆదర్శనగర్‌లోని బ్లెస్సింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్‌లో ఎమ్మెల్యే గంగులను ఆశీర్వదించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లలోని బేతేలు ప్రార్థన మందిరంలో కేక్‌ను కట్ చేశారు. ఆయాచోట్ల ఆయన వెంట మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నాయకులు బోనాల శ్రీకాంత్, గందె మహేశ్, అర్ష మల్లేశం, కర్ర సూర్యశేఖర్, క్రైస్తవ మతగురువు, క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

