జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు?
‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్‌పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఏమైనా మార్చారా..?’ అంటూ మేయర్ సునీల్‌రావు ఫైర్ అయ్యారు.
- అధికారం లేని మంత్రి ప్రభాకర్ బల్దియాపై సమీక్షించడం విడ్డూరం
- ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చారా..?
- అధికారం లేని మంత్రి ప్రభాకర్ బల్దియాపై సమీక్షించడం విడ్డూరం
- కనీస సమాచారం కూడా ఇవ్వరా..?
- ఆరోపణలపై విచారణకు మేం రెడీ.. మీరు సిద్ధమేనా..?
- మంత్రి పొన్నంపై మేయర్ సునీల్‌రావు ఫైర్
- దమ్ముంటే బడ్జెట్లో బల్దియాకు 200 కోట్లు నిధులు కేటాయించాలని సవాల్
కార్పొరేషన్, జూన్ 19: ‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్‌పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఏమైనా మార్చారా..?’ అంటూ మేయర్ సునీల్‌రావు ఫైర్ అయ్యారు. కుటుంబంతో సహా తన ఓటు హక్కును సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు మార్చుకొని బదిలీ అయిన మంత్రి పొన్నం, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కాదని ఏ అధికారంతో మున్సిపల్‌పై సమీక్ష చేశారని ప్రశ్నించారు. కనీసం నగరపాలక సంస్థకు చెందిన 60 మంది సభ్యులకు గానీ, కో ఆప్షన్ సభ్యులకు గానీ, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, నగర మేయర్‌కు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులతో సమీక్ష ఎలా నిర్వహిస్తారని జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నించారు.
అధికార ప్రోగ్రాంను పార్టీ కార్యక్రమంలా భావించి సమావేశం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పొన్నంకు దమ్ముంటే వచ్చే బడ్జెట్లో నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 200 కోట్ల నిధులు కేటాయించే విధంగా చూడాలన్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడారు. కరీంనగర్ ప్రజలు మూడు సార్లు డిపాజిట్ రాకుండా ఓడగొట్టారన్న కోపంతో పొన్నం ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నగరంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న కోపంతో రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా నగరాభివృద్ధి కోసం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేని వ్యక్తి, ఇప్పుడు నగరంలో సాగుతున్న అభివృద్ధిపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.
గడిచిన పదేళ్లలో జరిగిన ప్రగతి ‘మీ కండ్లకు కనబడడం లేదా?’ అని నిలదీశారు. ఆదరించిన హుస్నాబాద్ ప్రజల కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తే బాగుంటుందని హితవుపలికారు. తమ పాలకవర్గంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక విధాలైన అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్‌లో 4 కోట్ల నగదు బహుమతి సాధించిన ఘనత తమదేనని, రాష్ట్రంలో మరే మున్సిపాలిటీకీ ఈ పురస్కారం రాలేదని గుర్తు చేశారు. నగర అభివృద్ధిపై ఆరోపణలు చేసిన మంత్రి, ఆయన ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలను చూస్తే ఎంత మార్పు చెందిందో కనిపిస్తుందన్నారు. ఎంపీగా పని చేసిన కాలంలో ప్రజల తాగునీటి కోసం ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మానేరు డ్యాంలో నీరు లేకుండా చేసి ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తెచ్చారని, ఫలితంగా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు.
తమ ప్రభుత్వంలో 133 కోట్లతో పనులు చేపట్టి నాలుగున్నరేండ్లపాటు ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేశామని గుర్తు చేశారు. ఇంకా పారిశుధ్య విభాగంలో వాహనాలు, యంత్రాల వినియోగంతో కార్మికుల భారాన్ని తగ్గించేందుకు సమూల మార్పులు తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉజ్వల పార్కు తప్ప మరొకటి లేదని, కానీ తమ పాలనలో నగరంలోని 24 పార్కులు, 35 వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, ఐలేందర్, శ్రీకాంత్, వాల రమణారావు, ఎడ్ల సరిత, నాంపల్లి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
అవగాహన లేకుండా విమర్శలా..?
సీఎం అస్యూరెన్స్, స్మార్ట్సిటీపై పొన్నంకు కనీస అవగాహన లేదు. అప్పటి మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో 347 కోట్ల నిధులు వచ్చాయి. ఏం తెలియకుండానే అభివృద్ధిపై ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మంత్రి హోదాలో ఉండి అధికారులను బెదిరించే మనస్తత్వం మానుకోవాలి. పొన్నం ఆరు నెలల పాలనలోనే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఆయన ఏం సమాధానం చెబుతారు? అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలంటున్న మంత్రి, మరి ఆయనపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణకు సిద్ధమేనా..? గతంలో ఎంపీగా బండి సంజయ్ అభివృద్ధి విషయంలో సహకారం అందించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో కూడా అదే తీరు నగరాభివృద్ధికి మరిన్ని నిధులు తేవాలి.
– మేయర్ సునీల్‌రావు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

