కరీంనగర్ రాంనగర్, ఆగస్టు 15 : కరీంనగర్ కమిషనరేట్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యాడు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోలొండ కోటలో సీఎం రేవంత్ చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు.
మానకొండూర్‌కు చెందిన ఉండింటి శ్రీనివాస్ ఇప్పటి వరకు సేవా పథకం, 26 క్యాష్ రివార్డులు, 18 జీఎస్‌ఈలు, 1 కమాండేషన్, 9 ప్రశంసా పత్రాలు పొందాడు. ధర్మపురి, కరీంనగర్ 2 టౌన్, అడవి ముత్తారం, పొతపల్లి, కరీంనగర్ 1టౌన్, స్పెషల్ బ్రాంచ్ కరీంనగర్, స్పెషల్ బ్రాంచ్ సిరిసిల్ల, గంభీరావుపేటలో పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ ఇంటెలిజెన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.