స్వయంకృషితో ఎదగాలి
దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని, పదిమందికి స్ఫూర్తినివ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.
- పదిమందికి స్ఫూర్తినివ్వాలి
- దళితబంధు లబ్ధిదారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచన
హుజూరాబాద్ టౌన్, నవంబర్ 2: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని, పదిమందికి స్ఫూర్తినివ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం పట్టణంలో దళిత బంధు పథకం కింద మంజూరైన లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ యూనిట్ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారుడిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యతమైన వస్తువులకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుందన్నారు. డిమాండ్ కనుగుణంగా వస్తువులను తయారు చేస్తూ మారెట్లో విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట రూరల్, నవంబర్ 2: పట్టణంలో పలువురు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దళిథబంధు యూనిట్లను బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. వాటి నిర్వహణ, వస్తున్న ఆదాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు పథకం రెండో విడుత డబ్బులను త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడు వ్యాపారంలో రాణించాలని సూచించారు. అనంతరం జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లిలో దళిత బంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న ఏడు కోళ్లఫారాలను కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేశ్, క్లస్టర్ అధికారి శ్రీమాల, ఈడీ నాగార్జున, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంపీడీవో సతీశ్రావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

