వేములవాడ టౌన్, అక్టోబర్ 4: శరన్నవరాత్రుల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు శుక్రవారం బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం, రాజరాజేశ్వరీదేవికి అభ్యంగన స్నానం, మహాభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటలకు ప్రదోషపూజ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనం గా నిర్వహించారు. బ్రహ్మచారిణి అలంకారంలో పూజలు చేశా రు. రాత్రి అమ్మవారిని నెమలి వాహనంపై ఊరేగించారు.