Godavarikhani | రైస్ మిల్లర్లతోనే ఎక్కువగా నష్టం.. అవగాహన సదస్సులో తేల్చి చెప్పిన జనగామ రైతులు
భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే అందించడంతోపాటు పంట పండించిన తర్వాత రైస్ మిల్లర్లతో ఎక్కువగా నష్టం జరుగుతోందని, వీటిపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని జనగామ రైతులు విజ్ఞప్తి చేశారు.
Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 21 : భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే అందించడంతోపాటు పంట పండించిన తర్వాత రైస్ మిల్లర్లతో ఎక్కువగా నష్టం జరుగుతోందని, వీటిపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని జనగామ రైతులు విజ్ఞప్తి చేశారు. రామగుండం నగర పాలక సంస్థ 6వ డివిజన్ (జనగామ)లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, బీటీటీ జిల్లా ఫామ్ స్కూల్ ఆన్ పాడి కార్యక్రమంలో పెద్దపల్లి ఏడీఏ మడికొండ శ్రీనాథ్, కేవీకే శాస్త్రవేత్త వై. వెంకన్న, వ్యవసాయ అధికారి ప్రకాష్, ఏఈఓ యోజన, స్థానిక కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ పాల్గొని రైతులకు ఆధునిక సాగు విధానాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరిలో పిలకలు, చీడ పీడలు, తెగలుకు నానో ఎరువులు వాడాలని సూచించారు. విత్తన శుద్ధి ద్వారా తెగులు సోకకుండా ఉంటుందన్నారు. చలికాలంలో అగ్గి తెగులు సోకే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. పొలం గట్ల మీద గడ్డి పెరగకుండా చూసుకోవాలనీ, లేదంటే ముందుగా తెగులు గట్లకు సోకి ఆ తర్వాత పొలంలోకి సోకుతుందన్నారు. పొలంలోకి వెళ్లేటప్పుడు ఒకే గట్టు వెంబడి వెళ్లకుండా అన్ని గట్లు తిరిగినప్పుడే పంటకు ఎక్కువగా తెగలు సోకిందో తెలుస్తుందన్నారు. పంట దిగుబడి కోసం తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలన్నార. వాతావరణంకు అనుకూల పంటలు వేయాలన్నారు. రైతుల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు హన్మంత రావు, రుద్రభట్ల నిఖిల్, జవ్వాడి విజయ్ రావు , ఐత లక్ష్మయ్య, బొడ్డు రవీందర్, జనగామ గట్టయ్య, సంజీవ్, రవీందర్, మల్లయ్య, రాజయ్య, రాజు, శేఖర్ తోపాటు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

