TUWJ leaders | జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి.. ఎంపీని కోరిన టీయూడబ్ల్యూజే నాయకులు
జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతి పత్రం అంద చేశారు.
జగిత్యాల, నవంబరు 11: జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతి పత్రం అంద చేశారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణచారి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించాయన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో రాయితీతో కూడిన ప్రయాణానికి జర్నలిస్టులకు బస్సు పాసులు అందజేస్తుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాసులను అందజేసేదని వాటిని గత 3 సంవత్సరాల క్రితం రద్దు చేశారన్నారు. వివిధ కారణాలతో రద్దుచేసిన జర్నలిస్టు రైల్వే పాసులను పునరుద్ధరించేందుకు కృషి చేయాలని ఎంపీని కోరారు.
సానుకూలంగా స్పందించిన ఎంపీ అరవింద్ రైల్వే పాసుల పునరుద్ధరణ విషయం రైల్వే మంత్రి, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టులు రాజేందర్ రెడ్డి, ఆనంద్, వంశీకృష్ణ, చింత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

