Jeevan Reddy | టీడీపీ నాయకుడు బక్కని నరసింహులు ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం టీడీపీ అహంకార పూరిత చర్యలకు నిదర్శనం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు.
టీడీపీ మహానాడులో బక్కని నర్సింహులు కామెంట్స్‌పై జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ నేటికీ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ పట్ల టీడీపీకి ఉన్న అక్కసు వెళ్లగక్కుతున్నారు. నరసింహులు వ్యాఖ్యలు టీడీపీకి సంబంధం లేకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడు ఖండించాలి. ఇంతవరకు నరసింహులు వ్యాఖ్యలను ఖండించకపోవటంతో ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుంది.
తెలంగాణ ఉద్యమాల గడ్డ.. నైజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి, నక్సల్ బరి ఉద్యమానికి ప్రతీక.. తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని త్యాగం చేసి, ఉద్యమ పార్టీ నెలకొల్పి, దేశంలో అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఒప్పించి, రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసిఆర్ దక్కుతుందన్నారు.
డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు
– బక్కని నర్సింహులు pic.twitter.com/cYHOO1dS9D
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026