Medical College students | ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారని తెలిసిందే. ఈ సోషల్ మీడియా కాలంలో ఏ నిరసన చేసినా కొంచెం ట్రెండీగా ఉండాల్సిందే. ఆ ట్రెండ్‌నే ఫాలో అవుతూ సరికొత్తగా నిరసన తెలిపారు జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు. నెట్టింట వైరల్ అవుతున్న జిమ్ జిమ్ తార పాటను పాడుతూ.. జగిత్యాల మెడికల్ కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ నిర్మించాలని కాలేజీ విద్యార్థులు టెంట్లు వేసి నిరసన దీక్షకు దిగారు.
ఈ క్రమంలో ‘జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా’ అని పాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలా ట్రెండీ పాటను యాడ్ చేస్తూ తమ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసేలా జగిత్యాల మెడికల్ విద్యార్థులు చేసిన వినూత్న నిరసన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా”
జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న “జిమ్ జిమ్ తార” పాటతో పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో