మహనీయుల ఆశయాలను కొనసాగించాలి : అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్
మహనీయుల ఆశయాలను కొనసాగించాలి అని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ అన్నారు.
జగిత్యాల, సెప్టెంబర్ 27 : మహనీయుల ఆశయాలను కొనసాగించాలి అని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం పాలనలో వందేమాతరం పాడితే శిక్షించే రోజుల్లో బాధితుల తరుపున లాయర్ గా వాధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యోధుడు అని కొనియాడారు.
బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటం చేసి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన తెలంగాణ వాది అని ప్రశంసించారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాటం చేసిన ఉద్యమకారుడు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే మనం అయనకీచ్చే నిజమైన నివాళి అని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో బి.సి సంక్షేమ శాఖ అధికారి, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

