Ramagundam Baldia | ఓటేసేందుకు వేళాయె.. రామగుండం బల్దియాలో ఎన్నికలకు సర్వం సిద్ధం
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగనుంది.
- 60 డివిజన్లు.. 315 మంది అభ్యర్థులు
- డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సామగ్రితో తరలిన సిబ్బంది
- పర్యవేక్షించిన పెద్దపల్లి కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ
Ramagundam Baldia | కోల్ సిటీ, ఫిబ్రవరి 10 : రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. 1వ డివిజన్ నుంచి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఆ డివిజన్ మినహా బుధవారం 59 మంది కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతుండగా 1,79,624 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు సిద్ధమయ్యారు.
నగర పాలక పరిధిలో 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో దాదాపు 45 వరకు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 60 మంది రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, 272 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 272 మంది సహాయ ప్రిసైడింగ్, 816 పోలింగ్ సిబ్బంది, 60 మంది ఓట్ల లెక్కింపు అధికారులను నియమించినట్లు అదనపు కలెక్టర్ అరుణ శ్రీ వెల్లడించారు.
కాగా, మంగళవారం గోదావరిఖని శారదానగర్ లో గల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా బుధవారం ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గం.ల తర్వాత పోలింగ్ బూత్‌లోకి అనుమతించబోరనీ, ఆలోపు కేంద్రంలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

