Sarangapoor | సారంగాపూర్, అక్టోబర్ 22: పశువులకు తప్పని సరిగా గాలికుంటు నివారణ టీకాలను వేయించాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ అన్నారు. మండలంలోని అర్పల్లి గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువులకు ఉచిత గాలికుంటు టీకాల శిఖిరాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ఆకస్మికంగా తనికీ చేసి వివరాలు తెల్సుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు పశువులకు తప్పని సరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశువుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, వ్యాక్సిన్ కోల్డ్ వైన్ మైయింటైనింగ్ పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సునీల్, సిబ్బంది షకీల్, కొండాల్, నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.