ఆధునిక పాలనా సౌధం.. ఆవిష్కరణకు సిద్ధం
పెద్దపల్లి జిల్లాలో నవశకం ఆరంభం కాబోతున్నది. ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువచేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ నేడే అందుబాటులోకి రాబోతున్నది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతుండగా, ఆ వెంటే కొంగొత్త పాలన మొదలుకానున్నది
- జిల్లాలో నేటి నుంచే కొంగొత్త పాలన
- సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఇకపై ఒకే చోటు నుంచి ప్రభుత్వ శాఖల సేవలు
- ఆనందంలో జిల్లా ప్రజలు
పెద్దపల్లి జిల్లాలో నవశకం ఆరంభం కాబోతున్నది. ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువచేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ నేడే అందుబాటులోకి రాబోతున్నది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతుండగా, ఆ వెంటే కొంగొత్త పాలన మొదలుకానున్నది. ప్రజలు అక్కడికీ.. ఇక్కడికీ తిరగాల్సిన పని లేకుండా ఒక్క దగ్గరే 41శాఖల సేవలన్నీ అందబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి నవ శకం ప్రారంభంకాబోతున్నది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో కొనసాగిన పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలను కలుపుతూ 2016 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ కొత్త జిల్లాగా ప్రకటించారు. పెద్దపల్లి, రామగుం డం నియోజకవర్గాలు పూర్తిగా, మంథని నియోజకవర్గంలోని మానేరు ఇవతలి మండలాలతోపాటు ధర్మారం మండలాలను కలుపుతూ ఏర్పాటు చేశారు. ఇంకా కొత్తగా రామగిరి, పాలకుర్తి మండలాలను ఏర్పాటు చేసి మొత్తంగా 14మండలాలతో కొత్త జిల్లా ఏర్పడింది. 2190 స్కేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో 215 రెవెన్యూ గ్రామాలతో, 267 గ్రామ పంచాయతీలు, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీలతో 2011జనాభా లెక్కల ప్రకారం 7లక్షల 95వేల జనాభాతో జిల్లా అవతరించింది.
ఒకేచోటుకు 41శాఖలు
జిల్లాలు విభజించి పరిపాలనా సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది. ఇందులో భా గంగా పెద్దపల్లి శివారులోని పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు ఆవరణలో 22 ఎకరాల విస్తీర్ణంలో రూ. 48.07 కోట్ల వ్యయంతో నూ తన కలెక్టరేట్ పనులకు శ్రీకారం చుట్టారు. తక్కువ సమయంలోనే జీప్లస్2 విధానంలో 98గదులతో ఆధునిక హంగులతో భవంతిని నిర్మించారు. పక్కనే అధికారుల గృహసముదాయాలను నిర్మించారు. కాగా, పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో సోమవారం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతుండగా, 41 ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువుదీరనున్నాయి.
ఆనందంలో ప్రజలు
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన చేరువై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కాగా, నేటి నుంచి సమీకృత కలెక్టరేట్ వేదికగా సేవలన్నీ ఒకేచోటు నుంచి అందనుండడంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అక్క డొ ఆఫీసు, ఇక్కడో కార్యాలయానికి తిరిగి ఇ బ్బందులు పడ్డామని, ఇప్పుడు ఎటూ తిరగాల్సిన పని ఉండదని సంబురపడుతున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి ఆ నుకుని డీసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీసు సే వలు సైతం అందుబాటులో ఉండనున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

