CCTV cameras | సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట.. హుజురాబాద్ ఏసీపీ మాధవి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయని, నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కేశవపట్నం గ్రామంలో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హుజూరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు.
- కేశవపట్నంలో కార్డన్ అండ్ సెర్చ్.. 72 వాహనాల సీజ్
- అనుమానితులపై నిఘా, ధ్రువపత్రాలు లేని వాహనాలపై చర్యలు
CCTV cameras | కేశవపట్నం, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయని, నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కేశవపట్నం గ్రామంలో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హుజూరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 40 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు రెండు ప్రత్యేక స్ట్రైకింగ్ టీమ్స్ పాల్గొన్నాయి. గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తులు, గుర్తుతెలియని వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సీజ్ చేసిన వాహనాల్లో 65 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలు, 3 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా గ్రామాల్లో నివసిస్తున్న అనుమానితులను, గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించవచ్చని తెలిపారు. అక్రమ కార్యకలాపాలను ముందుగానే పసిగట్టి, నేరాలను నియంత్రించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని, ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు, నేరస్థుల్లో పోలీసుల పట్ల భయాన్ని కలిగించేందుకు ఇటువంటి ఆపరేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏసీపీ సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డుపై వాహనదారులు నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

