voting rights | జగిత్యాల, ఆగస్టు 24 : ఓటు చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఓటు హక్కును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్నికల సంఘం హరిస్తున్నాయని విమర్శించారు.
ఓట్ చోరీపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ చోరీ చేయడమే బీజేపీ లక్ష్యమని నిర్మలా రెడ్డి దుయ్యబట్టారు. ఓట్ చోరీ అంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని ఆమే పేర్కొన్నారు. బీహార్ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
‘ఓటర్ అధికార్ యాత్ర’ లో లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రాహుల్ గాంది చేపట్టిన యాత్ర ఆరో రోజుకు చేరుకుందని చెబుతూ ఈ యాత్రలోకాంగ్రెస్ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, మేధావులు, మహిళలు, పాల్గొoటుoడడంతో మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఈ యాత్రలో బీజేపీ చేసిన ఓటు చోరీపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని నిర్మలా రెడ్డి తెలిపారు.