కమాన్ చౌరస్తా, డిసెంబర్ 24 : ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్‌కు అడుగు పడుతుందని కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) జే శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఉన్నతంగా స్థిరపడాలంటే అందుకు లక్ష్యం ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రం కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం రేకుర్తిలోని అల్ఫోర్స్ కళాశాల ప్రాంగణంలో ‘నమస్తే తెలంగాణ’ , ‘తెలంగాణ టుడే’- కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ కార్యక్రమం పేరిట ఇంటర్ విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేఎల్ యూనివర్శిటీ హైదరాబాద్ శాఖ ప్రిన్సిపాల్ ఎల్ కోటేశ్వర్, ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లా బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి ప్రకాశ్ రావు, ‘నమస్తే తెలంగాణ’ అడ్వైర్టెజ్‌మెంట్ డిప్యూటీ మేనేజర్ మల్లయ్య, అల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్ జీ రాజశేఖర్‌రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్ తర్వాత ఎలాంటి ఉన్నత విద్యనభ్యసించాలి? ఎక్కడ చదవాలి? ఎలా చదవాలి? అనే సంకోచంలో చాలా మంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్‌ను చేతులారా వ్యర్థం చేసుకుంటున్నారని చెప్పారు.
ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేస్తున్నా, ఎలాంటి నైపుణ్యం లేకుండానే డిగ్రీలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన కాలేజీని ఎంచుకొని కష్టపడితే సర్టిఫైడ్ ఇంజినీర్లు కాకుండా, క్వాలిఫైడ్ ఇంజినీర్లుగా ఎదగవచ్చని చెప్పారు. లక్షల జీతాలతో జీవితాల్లో స్థిరపడవచ్చని చెప్పారు. విద్యార్థులు ఉన్నత భవిష్యత్ కోసం తమ కేఎల్ యూనివర్సిటీని ఎంచుకోవచ్చని దీమాగా చెప్తున్నామన్నారు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు తమ యూనివర్సిటీలో విద్యాలక్ష్మిని పథకాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక కోర్సులో డిగ్రీ చదువుతూ, మరో రెండు కోర్సుల్లో డ్యుయల్ డిగ్రీ చదువుకునే అవకాశముందన్నారు.
ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారని, ఇప్పటి వరకు అత్యధికంగా 60 లక్షల జీతం తీసుకుంటున్నారని వివరించారు. అలాగే, ఇక్కడ రెండేళ్లు చదివిన విద్యార్థి మిగతా చదువును ఇతర దేశాల్లో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు. మూడేళ్లు ఇక్కడ చదువుకున్న విద్యార్థి మరో ఏడాది విదేశాల్లో పూర్తి చేసుకోవచ్చన్నారు. ఇది తమ కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే ఉన్న అవకాశం అని స్పష్టం చేశారు. అలాగే, మార్కెట్లో ఉన్న కోర్సులకు అనుగుణంగా తమ యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ రంగంలో రెండో ఏడాది నుంచే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మా స్టూడెంట్లకు మంచి ప్లేస్‌మెంట్స్
కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష రాసిన విద్యార్థులకు అద్భుత అవకాశాలున్నాయి. మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మొదటి నుంచి ప్రాక్టికల్ శిక్షణ ద్వారానే విద్యనందిస్తున్నాం. హైదరాబాద్‌లోని అనేక సాఫ్ట్వేర్ సంస్థలతో అనుసంధానం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా క్యాంపస్‌లో ఉదయం క్లాస్‌కు వచ్చి సాయంత్రం హైదరాబాద్‌లోని ఏ సంస్థలోనైనా ఉద్యోగం చేసేంత సత్తా మా యూనివర్సిటీతో సాధ్యం. మా వద్ద చదివే కరీంనగర్ విద్యార్థులతో మాట్లాడి ఈ విషయం తెలుసుకోవచ్చు. మా వద్ద చదివిన విద్యార్థులకు 100 శాతం ఉన్నత వేతనంతో ప్లేస్మెంట్ వస్తున్నది. విద్యార్థులు వాళ్ల పేరెంట్స్‌తో కలిసి మా క్యాంపస్‌ను పరిశీలించి, భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు 91339 24000 నంబర్లో సంప్రదించవచ్చు. – ఎల్ కోటేశ్వర్, యూనివర్సిటీ హైదరాబాద్ శాఖ ప్రిన్సిపాల్
విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
అల్ఫోర్స్‌లో చదివే విద్యార్థులను అన్నింటా ప్రోత్సహిస్తున్నాం. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఐఐటీ, జేఈఈతోపాటు పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి సహకారంతో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయిస్తున్నాం. ఇలాంటి అవకాశాన్ని విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నతంగా ఎదిగేందుకు బాటలు వేసుకోవాలి.
– రాజశేఖర్‌రెడ్డి, అల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్
మంచి అవకాశం
నేను టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. మంచి కాలేజీలో చదివితే మంచి అవకాశాలు వస్తాయని మా అన్న నాకు చెప్పాడు. అందుకే నన్ను అల్ఫోర్స్‌లో కళాశాలలో చేర్పించారు. ఇక్కడ టీచింగ్ బాగున్నది. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. విదేశాల్లో చదువుకోవాలన్నదే నా లక్ష్యం. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకెళ్తా.
– రాహుల్, ఎంపీసీ సెకండియర్
చాలా విషయాలు తెలిశాయి
ఇంటర్ తర్వాత ఏం చేయాలనేది ఇంతకుముందు పెద్దగా క్లారిటీ లేదు. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ సదస్సు ద్వారా చాలా విషయాలు తెలిశాయి. ఒక రకంగా మా భవిష్యత్తు కళ్లముందు కనిపించింది. ఇలాంటి కార్యక్రమం అల్ఫోర్స్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం నాలాంటి వాళ్లకు ఎంతగానో ఉపయోగపడింది.
– కార్తీక్, ఎంపీసీ సెకండియర్
క్లారిటీ వచ్చింది
నమస్తే తెలంగాణ, కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్‌తో నాకో క్లారిటీ వచ్చింది. ఇంటర్ తర్వాత ఎం చదవాలనే విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడింది. ఉన్నత ఉద్యోగం పొందాలంటే మంచి కాలేజీలో చదవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడి చదివితేనే ఉన్నత లక్ష్యం చేరుకోవచ్చు అనే అంశాన్ని చక్కగా వివరించారు.
– శివమణి, ఎంపీసీ సెకండియర్
అర్థమయ్యేలా వివరించారు
కేఎల్ యూనివర్సిటీలో అందించే చాలా విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు. మున్ముందు ఏం చేయాలి? ఉన్నత భవిష్యత్ కోసం ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి? అని మాకు అర్థమయ్యేలా చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఇన్ని రకాలుగా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, సమీపంలోనే యూనివర్సిటీలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
– సిద్దార్థ్, ఎంపీసీ సెకండియర్