Collector Koya Sri Harsha | నామినేషన్ తిరస్కరిస్తే మళ్లీ అప్పీల్ కు అవకాశం.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక ఇన్ఛార్జి కమిషనర్ జే అరుణ శ్రీతో కలిసి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
- గోదావరిఖనిలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాల పరిశీలన
Collector Koya Sri Harsha | కోల్ సిటీ, జనవరి 29 :పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక ఇన్ఛార్జి కమిషనర్ జే అరుణ శ్రీతో కలిసి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
అనంతరం నగర పాలక కార్యాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. నగర పాలక పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి రామగుండం, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ పట్టణాల్లో ఎక్కడికక్కడే నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అరుణ శ్రీ కలెక్టర్ కు వివరించారు. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామనీ, 31న పరిశీలన పూర్తి చేసి సక్రమంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గం.ల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనీ, సదరు అప్పీల్ ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామనీ, 3న మధ్యాహ్నం 3 గం.ల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందనీ, ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట నగర పాలక అధికారులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

