Internal roads | గన్నేరువరం, సెప్టెంబర్25 : చినుకు పడితే చాలు గన్నేరువరం మండలకేంద్రంలోని అంతర్గత రోడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాహన రద్దీతో రోడ్ల పై గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. మండలకేంద్రం నుండి పారువెల్ల, ఖాసీంపేట గ్రామాలకు వెళ్లే దారిలో పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు పై అడుగుకో గుంత ఏర్పడి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది.
ఇల్లంతకుంట మండలం పోత్తూరు మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన మార్గంలో చావడి వద్ద చినుకు పడితే నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.