గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తున్నది. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలుపర్చడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నది. ప్రజలందరూ టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు. పట్టుదలతో గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నం. ఈటలను ఓడించి తీరుతం.
– మేకల రవి, లక్ష్మీపూర్ గ్రామం
దళిత బంధు పథకం అమలు కోసం అధికారులు సర్వే చేపడుతున్నారు. పదిలక్షలు ఇవ్వడమనేది ఎంతో గొప్ప విషయం. ఈ పథకంతో దళితుల బతుకులు మారుతయి. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటం. సారుకు అండగా ఉంటాం. మా వంతు సహాయ సహకారాలు అందిస్తం. తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తం.
– దొడ్డె మణింద్ర, పెద్దంపల్లి గ్రామం, జమ్మికుంట మండలం
ముఖ్యమంత్రి సారు దళిత బంధు పథకం తీసుకొచ్చిండు. ఎంతో మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. దళితులందరు సంబురాల్లో ఉన్నారు. కేసీఆర్‌ను మేం మరిచిపోం. ఆయనకు ఎప్పుడైనా అండగా ఉంటం. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవడుతం. ఇంటింటికీ సర్వే చేస్తున్నరు. ఇంతకంటే సంబురం ఏముంటది.
– అనూష, సిరిసేడు గ్రామం, ఇల్లందకుంట మండలం
కేసీఆర్ సారు అందరికి అన్ని ఇస్తున్నడు. గొర్ల పథకం మొదలుకొని ఎస్సీలకు దళిత బంధు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నరు. గెల్లు శ్రీనును గెలిపిస్తేనే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం అందరం కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీను గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేద్దాం. టీఆర్ఎస్ను గెలిపిస్తేనే పనులు చేయాలని అడగడానికి అవకావం ఉంటది.
– స్వరూప, పెద్ద పాపయ్యపల్లి, జూరాబాద్ మండలం