హోలీ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హ్యాపీ హోలీ’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 7 ఆనందాల హోలీ
కమాన్‌చౌరస్తా, మార్చి 7: జిల్లా ప్రజలు మంగళవారం హోలీ వేడుకలను అట్టహాసంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్-ప్రియాంక దంపతులను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంత్, కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పో, వివిధ సంఘాల నాయకులు కలిసి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పోలీస్ హెడ్ క్వార్టర్లో సీపీ సుబ్బారాయుడుతో పాటు అన్ని విభాగాలకు చెందిన పోలీసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం వారంతా స్థానిక డీఐజీ రమేశ్ నాయుడిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
తెలంగాణ చౌక్‌లో..
నగరంలోని తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రికి పలువురు నాయకులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు మంత్రి నివాసంలో పలువురు నాయకులు, అధికారులు, నగరవాసులు మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హోలీ పండుగను అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకొంటారని పేర్కొన్నారు.
ప్రజల ఆశీర్వాదంతోనే తాము అధికారంలో ఉన్నామని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని, అందుకే రాష్ట్రానికి, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని, సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలన్నారు. ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్ రావు దంపతులు వేడుకల్లో పాల్గొనగా, పలువురు ఆయనకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. కోర్టు చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అలాగే, జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. కిసాన్‌నగర్‌లో పెండ్యాల మహేశ్ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు హోలీ వేడుకలు జరుపుకొన్నారు.
కొత్తపల్లి, మార్చి 7: నగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ చక్రధర్‌రావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్‌రెడ్డి, గన్ను మహేందర్ రెడ్డి, సంతోష్‌కుమార్, శ్యామ్‌ప్రసాద్, ఆకుల ప్రభాకర్, మునీందర్‌రెడ్డి, మల్లేశం, వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కర్ర సూర్యశేఖర్, మొగిలోజు వెంకట్, రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో జరిగిన హోలీ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌ను కౌన్సిలర్లు, పట్టణవాసులు, పారిశుధ్య కార్మికులు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ, మార్చి 7: మేయర్ వై సునీల్‌రావును తెలంగాణ జాగృతి యువత జిల్లా బాధ్యులు కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువత జిల్లా కన్వీనర్ ఉయ్యాల విష్ణువర్ధన్ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ అనువోజు రవికాంత్, విద్యార్థి విభాగం కో-కన్వీనర్ సత్తు సంతు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, మార్చి 7: నగరంలోని తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య ఆధ్వర్యంలో హోలీ సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల సంపత్, రాజు, జయరాం, నర్సయ్య, సదానందం, రమేశ్, వేణు పాల్గొన్నారు.
చొప్పదండి, మార్చి 7: మండల ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను సీఐ రవీందర్, ఎస్ఐ ఉపేంద్రాచారి, ఎంపీపీ చిలుక రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
గంగాధర, మార్చి 7: మండల ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. మధురానగర్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని మండల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
రామడుగు, మార్చి 7: మండల ప్రజలు హోలీ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లోని కూడళ్లలో కామ దహనం చేశారు. మండల ప్రజలకు రామడుగు, కొక్కెరకుంట సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వరరావు, వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మీకిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎస్ఐ అంజయ్య హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ రూరల్, మార్చి 7: మండలంలోని చామనపల్లిలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ బోగొండ లక్ష్మి, బోగొండ ఐలయ్య, ప్రభాకర్, బుర్ర గంగయ్య, గర్వంద శ్రీనివాస్, వడ్లకొండ రవీందర్, వడ్లకొండ పరశురాములుగౌడ్, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గోపాల్‌పూర్‌లో వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఊరడి మల్లారెడ్డి, ఆరె శ్రీకాంత్, మంద రాజమల్లు, ఊరడి శివారెడ్డి, పొన్నేందర్, వేణు, అంజయ్య, దుర్శేడ్‌లో సుంకిశాల సంపత్‌రావు, నందల తిరుపతి, వేముల అశోక్, రామచంద్రం, వేణుమాధవరావు, బుర్ర రమేశ్‌గౌడ్, తోట తిరుపతి, ఎన్ శ్రీనివాస్, రామోజు తిరుపతి, చేగుర్తిలో చామనపల్లి రాజయ్య, చంద్రమోహన్, గాండ్ల కొమురయ్య, గాండ్ల అంజయ్య, బాషవేని మల్లేశం యాదవ్, సంపత్‌యాదవ్, మొగ్దుంపూర్లో జక్కం నర్సయ్య, దామెరపల్లి అంజిరెడ్డి, కుక్కట్ల తిరుపతి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కందుల రమేశ్ గౌడ్, సంపత్, తొగరు మల్లారెడ్డి, దాడి లచ్చయ్య, దాడి లక్ష్మన్, ఆంజనేయులు, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఇరుకుల్లలో బుర్ర రమేశ్, సంపత్, సర్వర్ పాషా, ప్రసాద్, శ్రీనివాస్, ఎండీ మహ్మద్, చెర్లభూత్కూర్‌లో దబ్బెట రమణారెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, మాసగోని రమేశ్‌గౌడ్, చిట్కూరి శేఖర్, కూర శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నాగభూషణం, ఆంజనేయులు, రంగారెడ్డి, బొమ్మకల్‌లో జోజి రెడ్డి, గూడ తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, తోట కిరణ్, రాజేందర్, సత్యనారాయణ, మద్దెల శ్రీనివాస్, జక్కినపల్లి శంకర్, ఎన్ ఆంజనేయులు, యుగేందర్, బీరం ఆంజనేయులు, కల్వల మల్లేశం, కల్వ అశోక్, గోష్కి శంకర్, ర్యాకం మోహన్, అశోక్, ఎలబోతారంలో బుచ్చాల కొమురయ్య, చల్ల లింగారెడ్డి, అశోక్, జూబ్లీనగర్‌లో కుమార్, సంతోష్, రమేశ్, మునీరెడ్డి, రాజేశం, రాజు, వెంకటేశ్వర్లు, సంపత్ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబురాలు చేసుకున్నారు.
నగునూర్‌లో ఎంపీటీసీలు వినయ్‌సాగర్, శ్రీనివాస్, సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, కస్తూరి అశోక్, రాంరెడ్డి, మధుకర్, వరి శంకర్, రాజాగౌడ్, దిలీప్ గౌడ్, బోనగిరి హన్మంతరావు, కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, నరహరి, ఫారూక్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నగునూర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, చల్మెడ ఆనందరావు, ప్రతిమ వైద్య కళాశాలల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన మండల నాయకులు
కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ను మండల నాయకులు కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్‌రావు, దుర్శేడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, శ్రీనివాస్, మహేశ్, తదితరులు ఉన్నారు.