మన ఆత్మగౌరవానికి విఘాతమే
కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.
- చిహ్నాన్ని చెరిపేయడం తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయడమే
- కాకతీయ తోరణం, చార్మినార్ రాచరికపు గుర్తులా..?
- గీతాన్ని మార్చడం చారిత్రక తప్పిదమే
- తెలంగాణలో సంగీత దర్శకులే లేరా
- కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడుతున్న చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు
- సంస్కృతి విచ్ఛిన్నాన్ని సహించేది లేదని హెచ్చరిక
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. వాటిని చెరిపివేయాలని చూడడం తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయడమేనని, మన ఆత్మగౌరవానికి విఘాతం కలిగించడమేనని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీపై ధిక్కారానికి ప్రతీక అయిన కళాతోరణాన్ని, ప్రకృతి విపత్తుపై సాధించిన విజయానికి చిహ్నంగా నిర్మితమైన చార్మినార్‌ను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన పాలకులు రాజకీయాల కోసం చరిత్రను చెరిపేసే కుట్రలు చేయడం సరికాదని సూచిస్తున్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బకొడుతూ.. తెలంగాణ చరిత్రకు సమాధి కట్టాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని మండిపడుతున్నారు. ఉద్య మ సమయంలో సీమాంధ్రపాలకులు తెలంగాణ సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసినట్టే, స్వరాష్ట్రంలోనూ అదే విధ్వంసం కొనసాగడం దురదృష్టకరమని చెబుతున్నారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ, ఇలా విచ్ఛిన్నం చేయాలని చూడడం సరికాదని తప్పుపడుతున్నారు. ఇక ‘జయ జయహే తెలంగాణ’ పాటను మార్చడం చారిత్రక తప్పిదమే అవుతుందని కళాకారులు, రచయితలు, సంగీత దర్శకులు మండిపడుతున్నారు. అసలు తెలంగాణలోనే సంగీత దర్శకులు లేనట్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ సంగీత దర్శకుడితో ఈ పాటను కంపోజ్ చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మన పాటను మన మట్టిబిడ్డలతోనే పాడించాలనేది మన ఆత్మగౌరవని స్పష్టం చేస్తున్నారు. తన పాటకు సంగీతం చేసే కీరవాణిని తలదన్నే సంగీత దర్శకులు తెలంగాణాలో లేరని అందెశ్రీ అనడం బాధాకరమని సంగీత దర్శకుడు మల్లిక్ తేజ వాపోయారు. ఎన్నికల ముందు ఏడాది క్రితం నేను ఏమీ ఆశించకుండా ఒక్కరోజులోనే ‘జయ జయహే తెలంగాణ’ పాటకు రూపకల్పన చేశానని చెప్పారు. అప్పుడు ఈ పాటను మళ్లీ అద్భుతంగా చేసే అవకాశం వచ్చినప్పుడు ‘నువ్వే చేస్తావు. మనమే కలిసి పని చేస్తాం’ అని చాలా సార్లు అందెశ్రీ తనతో అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం మాటతప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిహ్నం మార్చడం రేవంత్‌రెడ్డి తరం కాదు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటి కేబినెట్ మీటింగ్‌లో తెలంగాణ చిహ్నాన్ని మార్చేస్తామని అంటే నేను ఆనాడే అవివేకమని చెప్పిన. ఇది కరెక్ట్ కాదు అని ఖండించిన. రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చడంపై ఆయన తరం కాదు. కేంద్ర ప్రభుత్వం పంపిన జీవో ప్రకారంగా ఇప్పుడున్న అధికారిక చిహ్నం ఆచరణలోకి వచ్చింది. కేంద్రం అనుమతి ఇస్తేగానీ దీనిని మార్చడానికి లేదు. వచ్చే నెల 2న అయ్యే పని మాత్రం కాదు. రాష్ట్రం నుంచి ప్రతిపాదన చేయాలి. కేంద్రం ఆమోదించాలి. అప్పుడే చిహ్నం మార్చడానికి అవకాశముంటుంది. అయినా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో సరైన కారణాలు చెప్పాలి కదా..? కేవలం రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని అంటున్నారు. అంటే భారత జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని కూడా తొలగించాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారా..? నాలుగు సింహాలున్న జాతీయ చిహ్నాన్ని తొలగించాలని చెబుతున్నారా..? దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

