High profits | కాల్వశ్రీరాంపూర్, జూలై 31 : వరి, పత్తి మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేయాలని ఉద్యానవన విస్తరణాధికారి బోడ్కల రాము అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం, పందిల్ల, పెద్దంపేట, గ్రామాల్లోని కూరగాయలు, పసుపు, పూల తోటలను శుక్రవారం రాము పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులను కలిసి పలు సూచనలు చేశారు. కూరగాయ సాగులో మేలైన మల్చింగ్ పద్ధతిలో సాగు చేయాలని వివరించారు. పంట మార్పిడీ తప్పని సరి అని సూచించారు. రైతులు రాయితీ పొందేందుకు పంట నమోదు చేయించుకోవాలని అన్నారు.