Health camp | మంథనిరూరల్, 19జూన్ : ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మంథని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ అన్నారు. ఎడ్ల శ్రీనివాస్ తల్లి ఎడ్ల వెంకటమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ఎడ్ల వెంకటమ్మ చారిటీ ఆధ్వర్యంలో మంథని మండలం పోతారం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, పటేల్ ఐ కేర్ ఆస్పత్రి సహకారంతో గ్రామస్తులకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ…. గ్రామ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్య శిబిరానికి సహకరించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు ఆరోగ్య విధానాలపైన అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చారిటీ సభ్యులు ఎడ్ల సుమంత్, బండారి సమ్మయ్య, ఎడ్ల ఆదిత్య, బండి లిరిష్, తోగారి నరేందర్, సమ్మరాజు, రమేష్, శ్రీ వైద్య ఫౌండేషన్ చైర్మన్ బుద్ధార్తి సతీష్ కుమార్, మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు సురేష్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, కోఆర్డినేటర్ శ్రీకాంత్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.