Gudem | ఆదర్శగ్రామం గంగాదేవిపల్లిని సందర్శించిన గూడెం జీపీ పాలకవర్గం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ చిట్ల రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గురువారం వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి సందర్శనకు వెళ్లారు.
Gudem | ఓదెల, మార్చి 12: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ చిట్ల రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గురువారం వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి సందర్శనకు వెళ్లారు. దేశానికి దిక్సూచిగా అభివృద్ధి చెందిన తీరును పరిశీలించడానికి గంగాదేవిపల్లికి వెళ్లినట్లు సర్పంచ్ తెలిపారు.
అక్కడ గ్రామం ఏ విధంగా అభివృద్ధి, అక్కడ ప్రజల సహకారం ఎలా ఉందనే అంశాలపై తెలుసుకోవడానికి వెళ్లినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. గంగాదేవి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని గూడెం గ్రామానికి నిర్మల్ పురస్కారం అవార్డు వచ్చే విధంగా తమ పాలకవర్గం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుడిగే కుమారస్వామి, వార్డు సభ్యులు తిప్పారపు అభిలాష్, కర్ర శ్రీధర్, బుడిగే లక్ష్మణ్, వీరముష్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

