Kachapur | డిసెంబర్1లోగా కాచాపూర్‌లో బెల్ట్ షాపుల మూసివేయాలి.. తీర్మాణం చేసిన గ్రామ పంచాయతీ
గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేసి, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాచాపూర్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు.
- బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు
- వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Kachapur | శంకరపట్నం, నవంబర్ 26 : గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేసి, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాచాపూర్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు పాలకమండలిలో ఏకగ్రీవ తీర్మాణం చేసినట్లు వారు గురువారం తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాల కారణంగా అనేక కుటుంబాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయని, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవల బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు ఆందోళన చేపట్టి గ్రామ పంచాయతీకి తమ సమస్యలను విన్నవించారు.
మహిళలు తెలిపిన సమస్యలను పరిగణనలోకి తీసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ అంశంపై గ్రామసభలో తీర్మానం చేసి సంబంధిత ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు పంపించాలని నిర్ణయించింది. బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, డిసెంబర్ 1లోగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయించాలని నిర్ణయించినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ వెల్లడించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ మద్యం విక్రయాలు కొనసాగిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని, పాలకవర్గం తరఫున కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం వ్యసనం కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని, ఇంట్లోని వస్తువులు సైతం తాకట్టు పెట్టి మద్యం సేవిస్తున్న దుస్థితి నెలకొందని సర్పంచ్ మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ సమస్యలను బయటపెట్టినందుకు వారిని అభినందిస్తూ, వారి అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా మద్యపాన నిషేధం అమలుకు గ్రామస్తులందరూ సహకరించాలని సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | బాల్యవివాహాల కట్టడికి మతపెద్దలు సహకరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

