Jagityal | చదువుతోనే బంగారు భవిష్యత్తు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్య పడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
Jagityal | జగిత్యాల, జూన్ 02 : చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్య పడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.
బాల్యం నుండే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంతో పనిచేస్తున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ గంప కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ జన్మదినం సందర్భంగా 65 మంది ఆవాస విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు డాక్టర్ భీమనాతిని శంకర్, నందెల్లి మదన్ మోహన్ రావు, కైలాసం, అశోకరావు, సంపూర్ణ చారి, మధుకర్, నరసింగరావు, సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

