వినోద్‌కుమార్‌ను గెలిపించాలి
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో శనివారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
- బీఆర్ఎస్ హయాంలోనే గొల్లకురుమలకు గుర్తింపు
- మాజీ ఎంపీ లింగయ్య యాదవ్
కార్పొరేషన్, మే 11: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో శనివారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. గొల్ల, కురుమలందరూ బీఆర్ఎస్కే మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ గొల్లకురుమలకు ఐదు ఎమ్మెల్యే సీట్లతో పాటు మంత్రి, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులను ఇచ్చిందన్నారు.
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గొల్లకురుమలను అవమానించిందని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేసే వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించి, బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీల సమస్యలపై మాట్లాడే వ్యక్తి వినోద్‌కుమార్ అని పేర్కొన్నారు. సమావేశంలో గొల్ల, కురుమ సంఘం నాయకులు ఐలేందర్‌యాదవ్, బీరయ్య, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

