గంగులపై విమర్శలు విడ్డూరం
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్‌పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
- ఓటమిఎరుగని నేతపై ఆరోపణలు సరికాదు
- బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
- తెలంగాణచౌక్‌లో మాజీ మంత్రి ప్లెక్సీకి క్షీరాభిషేకం
కార్పొరేషన్, డిసెంబర్ 20: కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్‌పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడుతూ, కరీంనగర్లో ఓటమి ఎరుగని నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు తమ మంత్రి వద్ద మెప్పు కోసం మాజీ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, ఐలేందర్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, దూలం సంపత్, రాజు, శ్రీనివాస్‌గౌడ్, చేతి చంద్రశేఖర్, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

