జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన మహిళలు, ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణలో ఆడిపాడారు.
యువతులు కోలాటాలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
-కమాన్చౌరస్తా, అక్టోబర్ 14