Rudrangi | తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రుద్రంగిలో రైతుల నిరసన
కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రుద్రంగి మండల కేంద్రంలో తూర్పు వాడ రైతు సంక్షేమ సంఘం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు.
Rudrangi | రుద్రంగి, నవంబర్ 26 : కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రుద్రంగి మండల కేంద్రంలో తూర్పు వాడ రైతు సంక్షేమ సంఘం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోళ్లు ప్రారంభించి తూకం వేయడం అధికారులు, ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. 17 తేమ శాతము వచ్చే వరకు ధాన్యం ఆరబెట్టి ప్యాడి క్లీనర్ తో వడ్లను చెత్త, తాలు లేకుండా పట్టిన తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారి ఆమోదించాలని నిబంధన తో రైతులు నష్టపోతున్నామన్నారు. రుద్రంగి లో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా 20 రోజుల క్రితం ప్రారంభించి తూకం వేయడం మరిచారన్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పడి ఉందని కొందరి రైతుల ధాన్యం తేమ శాతం వచ్చి సిద్ధంగా ఉన్న తూకం వేయడం లేదన్నారు.
ప్రభుత్వం చెప్పిన విదంగా సన్న వడ్లు పండించిన కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. సొసైటీలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో దళారులు ఆసరాగా తీసుకొని వాళ్ళ ఇస్టనుసారంగా వ్యవహరిస్తూన్నారని, నచ్చినా ధాన్యాన్ని కొంటూ నచ్చని ధాన్యన్ని దళారులు కొనకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. మద్దతూ దరకంటే తక్కువ ధరకే కొంటున్నారని అలాగే తుకంలో కూడ మోసాలు జరగడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాల వైపు చూడడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. కొత్త నిబంధనలు లేకుండా గతంలో లాగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు వాడ రైతు సంక్షేమ సంఘం రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- farmers
- paddy
- Procurement
- Protest
RELATED ARTICLES
తాజా వార్తలు
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : సీఈఓ నాగలక్ష్మి
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
Vaibhav Sooryavanshi | పిజ్జాకు దూరం.. రోజుకు 600 బంతుల ప్రాక్టీస్.. వైభవ్ సూర్యవంశీ ట్రైనింగ్, న్యూట్రిషన్ సీక్రెట్స్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

