Odela | ఓదెల, సెప్టెంబర్ 27 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గ్రామాల్లో (ఎస్‌హెచ్‌జీ) స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. హరిపురం గ్రామంలో జరిగిన అమ్మకు అక్షరమాల నిరక్షరాశులకు నిర్వహించిన పరీక్షలను సర్పంచ్ గారవేణి విజయ-నాగరాజు యాదవ్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నిరక్షరాసులైన స్వయం సహాయక సంఘ సభ్యులకు అక్షరాలు నేర్పించడం చాలా మంచిదని పేర్కొన్నారు. ఇందుకు మహిళలు విద్యపై ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. మహిళల అక్షరాస్యతపై తమ వంతు సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వీవోలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు తదితరులు పాల్గొన్నారు.