Makkan Singh Seva Samiti | పాలకుర్తి : పాలకుర్తి మండల కేంద్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరం సహకరించుకోవాలని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాలతో కలిసి ఆమె గ్రామంలోని పలు సమస్యలను సోమవారం చర్చించారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, వీది దీపాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన లోపాలు తదితర అంశాలపై మహిళా సంఘం సభ్యులు మనలి ఠాగూర్ కు వివరించారు.
ఎమ్మెల్యే మక్కాన్సింగ్ దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహాయంతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు మక్కాన్సింగ్ సేవాసమితి అధ్యక్షురాలు మనాలి ఘనంగా సన్మానించారు. మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆమె వివరించారు.