కొత్తపల్లి/ హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట/మానకొండూర్, మే 16: జాతీయ డెంగ్యూ దినం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రోగ్రాం అధికారులతో కలిసి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే సరైన సమయంలో చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో డీటీసీవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీరెడ్డి, డీఐవో డాక్టర్ సాజిదా, పీవోఎన్ సిడి డాక్టర్ విప్లవశ్రీ , పీవోఎంసీహెచ్ డాక్టర్ సనా జవేరియా, డీఎంవో డాక్టర్ శైలేంద్ర, డెమో రాజగోపాల్, డీపీవో స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నజియా, సబ్ యూనిట్ ఆఫీసర్ రామనాథం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణంలో వైద్యారోగ్య శాఖ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్త వహించడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, ఆర్ఎంవో డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ మధు, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్.. డెంగ్యూ కారణాలు, తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు ఫర్హానుద్దీన్, సంధ్యారాణి, కార్తీక్, సంధ్య, చందన, హిమబిందు, విజయ్‌కుమార్, హెచ్ఈ మోహన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే మానకొండూర్ పీహెచ్సీ సిబ్బంది మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సల్మాన్, సీహెచ్‌వో రాజూనాయక్, సూపర్వైజర్స్ సరోజ, జుబేర్, సిబ్బంది పాల్గొన్నారు.