Kalavasrirampur | కాల్వశ్రీరాంపూర్, జూన్ 14 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి శ్రీ కాశీ మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయ కమిటీని సర్పంచ్ అడిగొప్పల రాణి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.
చైర్మగా పెనుగొండ శ్రీకాంత్, వైస్ చైర్మన్‌గా నరెడ్ల సతీష్, కార్యవర్గ సభ్యులుగా పిట్టల సురేష్, సూత్రాల వేణు, తూడి పవన్ కళ్యాణ్, బుర్ర నవీన్, సిరిసిటీ ఆనంద్ కుమార్, పిట్టల అజయ్, రమణ, బోయిన సిద్ధార్థ, పిట్టల మోహన్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సువర్ణ శ్రీధర్ శర్మ, సువర్ణ రాజేందర్ శర్మ, ఆలయ పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.