Land issues | మల్లాపూర్ జూన్ 6: గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కారం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తైన వాటిని వెంటనే ఆన్ లైన్లో నమోదు చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతీ దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని, భూ భారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ తహసిల్దార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.