కలెక్టరేట్, అక్టోబర్ 26 : ఎన్నికల నిర్వహణలో సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులది కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయాన్ని సుశితంగా పరిశీలించి వాటిని ఎన్నికల సంఘానికి కచ్చితంగా సమర్పించే విధంగా చూడాలని సూచించారు.
ఎన్నికల సంఘం నియమించే వ్యయ పరిశీలకులు జిల్లాకు రాకముందే వారికి అవసరమైన వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు సమగ్రంగా తయారు చేసి నివేదిక రూపంలో పొందుపరచాలని ఆదేశించారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమ నిబంధనలను వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, డీటీవో నాగరాజు, సీపీవో కొమురయ్య, సహకార డిప్యూటీ రిజిస్ట్రార్ సీహెచ్ మనోజ్ కుమార్, డీఆర్డీఏ అదనపు పీడీ వెంకటేశ్వర్లు, లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు, సహకార శాఖ ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.