Environment Day | గోదావరిఖని: సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జీఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనారా సంచుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా ఆర్జీ-1 ఏరియా జీఎం డీ లలిత్ కుమార్ హాజరై జీఎం కార్యాలయ సివిక్ జీఎం ఆఫీస్ సిబ్బందికి జూట్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ వారి ఆదేశాల మేరకు పర్యావరణ దినోత్సవ వేడుకలను కంపెని వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జూట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నట్లు చేశారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని దానికి ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా పర్యావరణ పరిరక్షణకు పాటు పాడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో భూతాపం విపరీతముగా పెరిగిపోతున్నదని, పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు.