ఆదిలాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ‘సారూ.. పదిహేను రోజులైనా మా జొన్నలను కొంటలేరు’ అంటూ ఓ మహిళా రైతు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందు కన్నీరు పెట్టుకున్నది. ఆదిలాబాద్ జిల్లాలో జొన్నరైతులు పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పంటను మార్కెట్‌యార్డుకు తీసుకుకొచ్చి పది, రోజులైనా నిర్వాహకులు తీసుకోవడం లేదు. శుక్రవారం ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ బోథ్ మార్కెట్‌యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పంటను తీసుకుచ్చి పదిహేను రోజులైనా కొనడం లేదంటూ మహిళా రైతు ఎమ్మెల్యే ముందు కన్నీరు పెట్టుకున్నది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
మహిళా రైతు పంటను వెంటనే కొనాలని సూచించారు. పంట కొనకుంటే తనకు ఫోన్ చేయాలని ఆమెకు ఫోన్ నంబర్ ఇచ్చి ధైర్యం చెప్పా రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటను విక్రయించేందుకు రైతులు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆయన నేరడిగొండ, బోథ్ మండలాల్లోని జొన్నల కొనుగోలు కేంద్రాలనుకూడా పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఎకరానికి కేవలం 10 క్వింటాళ్ల చొప్పున మాత్రమే సేకరిస్తు న్నారని మిగతా పంట కొనకపోవడంతో ప్రై వేట్ వ్యాపారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ప్రతి గింజనూ కొనేంత వరకూ బీఆర్ఎస్ త రఫున ఆందోళన కార్యక్రమాలు చేపడు తామని, అధైర్యపడొద్దని రైతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.