Dharmapuri | అల్గునూరు సభకు బయలుదేరిన ధర్మపురి బీఆర్ఎస్ శ్రేణులు
దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ అల్గునూరులో చేపట్టిన దీక్షా దివస్ సభకు ధర్మపురి నియోజకవర్గ కేంద్రంతో పాటు నియోజకవర్గం లోని ధర్మపురి, వెల్గటూర్, ఎండపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్లారు.
Dharmapuri | ధర్మపురి, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ అల్గునూరులో చేపట్టిన దీక్షా దివస్ సభకు ధర్మపురి నియోజకవర్గ కేంద్రంతో పాటు నియోజకవర్గం లోని ధర్మపురి, వెల్గటూర్, ఎండపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మారం మండలాల్లోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్లారు. దీంతో గ్రామాల్లో గులాబీ సందడి నెలకొంది. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు భారీగా అల్గునూరు సభకు పయనమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ నిర్వహస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు. ధర్మపురి నుండి తరలి వెళ్లిన వారిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు అయ్యోరి రాజేష్ కుమార్, బండారు రంజిత్, నాయకులు ఒడ్నాల మల్లేశం, సంగీ శేఖర్, చిలివేరి శ్యాంసుందర్, బాకీ శేఖర్, అశోక్, రవి, రాజన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

