Chigurumamidi | చిగురుమామిడిని కరువు మండలంగా ప్రకటించాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 2 : రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. వర్షాలు లేక పంటలు కళ్లముందే ఎండిపోతుంటే, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. నియోజకవర్గంలో ఎ ఒక్క మండలాన్ని కరువు మండలంగా మంత్రి ప్రకటించలేదని అన్నారు. మంత్రి పొన్నం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలతో, తోటపల్లి రిజర్వాయర్ నీటితో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నారన్నారు. నేడు ఆ రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరానికి కూడా రైతులకు సాగు నీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. వెంటనే చిగురుమామిడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మామిడి అంజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కోడం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంగ రమణారెడ్డి, రామోజు కృష్ణమాచారి, భేతి రాజిరెడ్డి, పెసరి రాజేశం, సన్నిల్ల వెంకటేశం, ఎండీ సర్వర్ పాషా, కత్తుల రమేష్, ఎస్కే సిరాజ్, సిద్దంకి రాజమల్లు, మిట్టపల్లి మల్లేశం అనుమాండ్ల సత్యనారాయణ, బెజ్జింకి లక్ష్మణ్, బుర్ర తిరుపతి శ్యామకూర సంపత్ రెడ్డి, మెడబోయిన తిరుపతి, చెప్యాల నారాయణరెడ్డి, కల్వల సంపత్ రెడ్డి, తాటికొండ సందీప్ రెడ్డి, మహంకాళి కొమరయ్య, కాశ బోయిన రాజు, కత్తుల ప్రశాంత్, పరిపాటి రవీందర్ రెడ్డి, తోట శ్రీనివాస్, బండారి మల్లేష్, కంప అశోక్, పాండవుల సంపత్ బండారి సమ్మయ్య, చాడ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

