Dasari Usha | పెద్దపల్లి, అక్టోబర్23: బీసీ హక్కుల కోసం నిస్వార్థంగా పని చేసే దాసరి ఉషకు జిల్లా బీసీ జేఏసీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని తెలంగాణ చేనేత ఐఖ్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు కోమటిపల్లి సదానందం కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో స్థానిక సంస్థలు, చట్ట సభల్లో బీసీ సముచిత రిజర్వేషన్లు కల్పించాలని ఉష దీక్ష చేశారని గుర్తు చేశారు.
ఇటీవల నిర్వహించిన బీసీ తెలంగాణ బంద్‌లో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషి చేశారని చెప్పారు. స్వంతంగా ఉపాధి పరిశ్రమలను నెలకొల్పి మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందదని వివరించారు. బీసీ జేఏసి చైర్మన్‌గా ఉషకు అవకాశం ఇస్తే జిల్లాలో బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకవెళ్లుతుందని తెలిపారు. సమావేశంలో నాయకులు మేరుగు లింగయ్య, బండ నిఖిల్ యాదవ్, దొడ్డ అశోక్, దాసరి రామస్వామి, కనుకుంట్ల మోహన్, సదయ్య గౌడ్, సాగర్, షఫి, పేరం రవి తదితరులు పాల్గొన్నారు.