Chigurumamidi | రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి.. చిగురుమామిడిలో పలు పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళి
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల అధ్యక్షుడు అందే స్వామి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, అందే సురేష్, నాగెల్లి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చిట్టిమల్ల రవీందర్ అన్నారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 26 : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల అధ్యక్షుడు అందే స్వామి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, అందే సురేష్, నాగెల్లి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చిట్టిమల్ల రవీందర్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని, దాని ద్వారా లభించిన హక్కులను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడు సాంబారి కొమురయ్య, రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి బడుకోలు దేవేందర్ రెడ్డి, మండల కోఆర్డినేటర్ రామోజు కృష్ణమాచారి, స్థానిక సర్పంచ్ ఆకవరం భవాని, ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ సన్నిల్ల వెంకటేశం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం అనిల్, వివిధ పార్టీల నాయకులు ఆకవరం శివప్రసాద్, కాశబోయిన రాజు, అందే చిన్న స్వామి,ముద్రకోల రాజయ్య, తేరాల సత్యనారాయణ, రాకం అంజవ్వ,కాత మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhil | జపాన్‌లో అఖిల్ ‘లెనిన్’ సందడి.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
Harish Rao | సైన్స్ ఫెయిర్ జరిపే స్థోమత కూడా ప్రభుత్వానికి లేదా..? : హరీశ్ రావు
Deeksha Divas | దేవరకద్రలో దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

