KalvaSrirampur | రైతులకు సాగునీరందించడంతో కాంగ్రెస్ విఫలం.. కాల్వశ్రీరాంపూర్ బీఆర్ఎస్ నాయకులు
రైతులకు సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి విమర్శించారు. కాల్వశ్రీరాంపూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.
KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 25 : రైతులకు సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి విమర్శించారు. కాల్వశ్రీరాంపూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు రైతులకు సాగునీరందక తమ పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు అరిగోస పడుతుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు నిర్విరామంగా 24గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర కరెంట్ ఇచ్చి, కరెంట్ కోతలు పెట్టి పంటలు ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వం ప్రాజెక్టునుండి వృథాగా పోతున్న నీటిని ఎత్తి పోయించి పంటలను కాపాడితే అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి పోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ నీటిని ఆంధ్ర పాలకులకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహరించి తెలంగాణ ను ఎడారిగా మార్చేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మాటలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి పరిస్థితుల్లో రైతలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తి పోయించి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి పంటలు కాపాడేందుకు సాగు నీటిని విడుదల చేశామని గొప్పలు చెప్పిన నాయకులకు చివరి ఆయకట్టుకు సాగునీరందక ఎండిపోయిన పంటలు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. కరువును జయించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని గుర్తు చేశారు. రాబోవు యాసంగిలో ప్రభుత్వం రైతులకు ఎన్నిగంటల కరెంట్ ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే విదంగా చూడాలని, లేకుంటే ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్పంచులు బూసి సదాశివరెడ్డి, మంథని రాజయ్య, తీగల నాగరాజు, నాయకులు ఆకుల స్వామి, వివేక్‌పటేల్, నిదానపురం దేవయ్య, జూకంటి అనీల్, భైరం రమేశ్, గోనే శ్యాం, జెట్టి దేవేందర్, కొట్టె రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, నాగార్జునరావు, నరెడ్ల సదయ్య, నవీన్, సారంగపాణి, కనుకయ్య, మహేందర్, దొమ్మటి శ్రీనివాస్, ఇబ్రహీం, తొట్ల శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్, జాలిగం నర్సింగం, ఎల్కపెల్లి చెంద్రయ్య, శరత్‌కుమార్, గొడుగు మల్లయ్య, కుంట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

