తిమ్మాపూర్, జూన్ 12 : యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మరో సీజన్లో వరి వేయాలంటే భయపడేలా చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారని, సాగు పండుగలా సాగిందని గుర్తు చేశారు. ఈ నెల 16న బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. కార్యకరలు నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తిమ్మాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విపతర పరిస్థితి కొనసాగుతున్నదని, నారు పోయాల్సిన రైతులు.. ఇంకా యాసంగి వడ్లనే పట్టుకొని ఉండాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా మానకొండూర్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు. మృగశిర వచ్చినా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని ఆరోపించారు. ‘రైతు భరోసా లేదు, పంట కొనే దికు లేదు, కరెంటు లేదు, రైతుకు ఏం చేస్తున్నరు’ అని ప్రశ్నించారు.
యూరియా యాప్‌లో లేదని.. షాప్‌లో లేదని అన్నారు. ఈ సారి కూడా యూరియా కష్టాలు తప్పేలా లేవన్నారు. పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వేడుకల కోసం హుకుం జారీ చేసిన ఆయన.. రైతుల సమస్యలపై ఎందుకు జారీ చేయలేదని, పంట కొనుగోలు విషయంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మానేరు పరిసరాల్లో ఇసుకడంపులు కనిపించడం లేదా? అని అడిగారు. అక్రమ సంపాదనకు ఎగబడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలని హితవుపలికారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌గౌడ్, ఉల్లెంగుల ఏకానందం, రవీందర్‌రెడ్డి, గంప వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.