చెక్‌డ్యాంలపై కుట్రలు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే విధ్వంసం
కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంలపై కుట్రలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసం జరుగుతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రుదేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజం
- ధ్వంసమైన అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం పరిశీలన
పెద్దపల్లి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)/ మంథని/ మంథని రూరల్: కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంలపై కుట్రలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసం జరుగుతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రుదేశాలు కూడా ఈ విధంగా ఎప్పుడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలోని మన నాయకులే మన రాష్ట్ర సంపదను ఈ విధంగా ధ్వంసం చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లి మానేరులో నిర్మించిన చెక్‌డ్యాం ధ్వంసం కాగా, పుట్ట మధుకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక చెక్‌డ్యాంను బాంబు పెట్టి పేల్చారని, ఆ ఘటన మరువకముందే మళ్లీ అడవి సోమనపల్లి చెక్‌డ్యాం ధ్వంసం చేశారని మండిపడ్డారు.
చుట్టుపక్క గ్రామాలైన అడవిసోమనపల్లి, వెంకటాపూర్, నాగెపల్లి, మల్హర్ మండలం వల్లెంకుంటతోపాటు మానేరు పరీవాహక ప్రాంతం వెంట ఉన్న కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులే ధ్వంసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడి ఇసుకను దోపిడీ చేసేందుకే పంచాయతీ ఎన్నికల్లో లక్షలాది రూపాయలను ఖర్చు చేశారని, వారు గెలిచిన వెంటనే ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. చెక్‌డ్యాం ధ్వంసంపై స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైనా పట్టించుకోకపోవడం మూర్ఖత్వమని విమర్శించారు. సమీప గ్రామాల ప్రజలతో కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, ఆసిఫ్, ఇర్ఫాన్, మబ్బు నాగరాజు, ఓదెలు, పోలు కనుకరాజు ఉన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు వీడియోకాల్
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం ధ్వంసంపై మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు వీడియోకాల్ కాల్ చేశారు. ధ్వంసమైన చెక్‌డ్యాంను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే తట్టుకొని నిలిచిన చెక్‌డ్యాం, నీళ్లు నిల్వ ఉన్న సమయంలో ఎలా కొట్టుకుపోతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారని పుట్ట మధూకర్ చెప్పారు. చెక్‌డ్యాం శిథిలాలు దిగువకు పడకుండా ఎగువకు పడి ఉండడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఇదే సమయంలో అక్కడున్న అడవిసోమన్‌పల్లి గ్రామస్తులు.. మాజీ మంత్రి హరీశ్‌రావును డ్యాం పరిశీలించేందుకు రావాలని కోరాగా, ఆయన వస్తానని చెప్పారు. చెక్‌డ్యాం ధ్వంసంపై రైతులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

