పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో మానస సరోవర్ వద్ద మొక్కలు నాటారు.
- విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి
- ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
- చామనపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి హాజరు
కరీంనగర్ రూరల్, జూన్ 5: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో మానస సరోవర్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అలాగే పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్‌స్వామి, ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో శోభారాణి, ఉపాధిహామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నగునూర్‌లో..
సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై విద్యార్థినులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గ్రామంలో అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సమత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సుష్మ, ఏసీవో డీ లలితా, అశ్విని, వివిధ విభాగాధిపతులు ఎన్ శ్రీలత, కే గీతారాణి, వీ జ్యోతిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
గోపాల్పూర్, ఎలబోతారంలో..
గోపాల్పూర్ గ్రామంలోని మురళీకృష్ణ ఆలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఊరడి శివారెడ్డి, ఎర్ర రమేశ్, నాయకులు పాల్గొన్నారు. ఎలబోతారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవో లక్ష్మీనారాయణ, సూపర్వైజర్ నిర్మల, పంచాయతీ కార్యదర్శి కవిత, అంగన్వాడీ టీచర్లు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
పోచమ్మవాడ అంగన్వాడీ కేంద్రంలో
కలెక్టరేట్, జూన్ 5: నగరంలోని కోతిరాంపూర్‌లో గల పోచమ్మవాడ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లులు, గర్భిణులు, బాలింతలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పర్యావరణం మెరుగుపడుతుందని అంగన్వాడీ టీచర్ స్వరూప పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్ర సిబ్బంది, పోచమ్మవాడ పరిసరాల మహిళలు పాల్గొన్నారు.
సప్తగిరి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో..
విద్యానగర్, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సప్తగిరి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సప్తగిరికాలనీలోని కోదండరామాలయంలో విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గడప కోటేశ్‌కుమార్, ట్రెజరర్ గునుకుల సత్యనారాయణరెడ్డి, శ్రీహరిరెడ్డి, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో..
హుజూరాబాద్ రూరల్, జూన్ 5: హుజూరాబాద్ మున్సిపల్ పరిధి బోర్నపల్లి గ్రామంలోని 14, 24వ వార్డుల్లో సనా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. సొసైటీ అధ్యక్షురాలు మహ్మద్ అస్మభాను, సభ్యులు పాల్గొన్నారు.
సింగాపూర్‌లో..
సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పరిసరించుకొని మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించగా, ముఖ్య అతిథిగా వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అంబాప్రసాద్ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ శంకర్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎంవీ సతీశ్ కుమార్, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా వరంగల్ చైర్మన్ డాక్టర్ అనుముల రామచంద్రారెడ్డి, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ సెక్రటరీ వరంగల్ డాక్టర్ ఏవీ గిరిధర్, కార్బన్ కాన్షియస్, ఎన్విరాన్మెంట్ క్లబ్ స్టాఫ్ అడ్వైజర్ వీ రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేశవపట్నం, గద్దపాక గ్రామాల్లో..
శంకరపట్నం, జూన్ 5: కేశవపట్నం బృహత్ పల్లె ప్రకృతి వనంలోని అమృత్ సరోవర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీవాణి నీటిని నిల్వ చేసుకునే పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఏపీవో శారద ఉపాధి హామీ కూలీలతో హరిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, కూలీలు పాల్గొన్నారు. అలాగే గద్దపాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సుమన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హాజరైన వైస్ ఎంపీపీ పీ రమేశ్ మాట్లాడుతూ, హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో కారోబార్ రవి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

