Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 8 : చిగురుమామిడి మండలంలోని ఆదర్శ (మోడల్) స్కూల్, కళాశాలలో విద్యార్థులకు యూనిఫాం షూస్ పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చేతుల మీదుగా మంగళవారం చేపట్టారు. విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించాలని, తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు.
క్రమశిక్షణ పట్టుదలతో లక్ష్యం వైపు ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హర్షిత్ కౌర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం2026 శిక్షారత్న అవార్డు అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ హర్షిత్ కౌర్ ను సర్పంచ్ శాలువాతో ఘనంగా సత్కరించారు.